ఇందిరమ్మ రాజ్యంతోనే ప్రజలకు మేలు: టీపీసీసీ చీఫ్ రేవంత్

by Shiva |
ఇందిరమ్మ రాజ్యంతోనే ప్రజలకు మేలు: టీపీసీసీ చీఫ్ రేవంత్
X

దిశ, అశ్వాపురం: భూ నిర్వాసితులకు రైతులకు, ప్రజలకు మేలు జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని అమ్మవారి పల్లి అమర్ధ గ్రామాల ప్రజలతో మంగళవారం సీతమ్మ సాగర్ డ్యాం సీతారామ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులతో రైతు కూలీలతో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు రైతు కూలీలకు పూర్తి న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ రాక్షస ప్రభుత్వం పోవాలన్నారు. ప్రభుత్వంలో సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేదని, సామాన్యుడు ఎంత మొరపెట్టుకున్నా అది అరణ్య రావు గారు ప్రాజెక్టు కింద భూమి కోల్పోయిన ఏ ఒక్క రైతు కూడా సరైన న్యాయం జరగలేదన్నారు. రైతులందరికీ సమన్యాయం జరిగేంత వరకు తాము పోరాడుతామని అన్నారు. ఎవరు ఎన్ని మాయమాటలు, కలబొల్లి కబుర్లు చెప్పినా.. రకరకాల పథకాల పేర్లు చెప్పి లోబర్చుకోవాలని ప్రయత్నం చేసిన ప్రజలు అప్రమత్తంగా ఓటు వేయాలన్నారు. ఇప్పటికే, కేసీఆర్ మాయమాటలతో రాష్ట్ర ప్రజలు దగపడ్డారని, మరోసారి తెలంగాణ ప్రజలు మోసపోకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క రైతులు, కూలీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story