దిశఎఫెక్ట్ : 'అనుమతులు లేవు.. కూలగొడితే కూలగొట్టండి'

by samatah |   ( Updated:2022-12-16 09:36:03.0  )
దిశఎఫెక్ట్ : అనుమతులు లేవు.. కూలగొడితే కూలగొట్టండి
X

దిశ, వైరా : కమర్షియల్ భవనానికి అనుమతులు లేవు.. నేను ఆ భవన నిర్మాణ సమయంలో అనుమతులు తీసుకోలేదు. మీకు చేతనైతే కూలగొడితే కూలగొట్టండి. నేను చేసేది ఏమీ లేదు.. మీరు ఇప్పటికిప్పుడైనా కూలగొట్టుకోండి.. అంటూ అక్రమంగా భవనం నిర్మించిన యజమాని మున్సిపాలిటీ అధికారుల ముందు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

దీంతో మున్సిపాలిటీ అధికారులు ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. వైరాలో అనుమతులు లేకుండా గత ఐదేళ్ల క్రితం నిర్మించి మున్సిపాలిటీకి ఎలాంటి పనులు చెల్లించని గంధం టవర్స్ ముందు కమర్షియల్ కాంప్లెక్స్ పై శుక్రవారం దిశ దినపత్రికలో 'అంతా అడ్డదిడ్డమే' వార్త కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన మున్సిపాలిటీ కమిషనర్ అనిత, టీపీఓ భాస్కర్, మున్సిపాలిటీ సిబ్బంది శుక్రవారం గంధం టవర్స్ ను, కమర్షియల్ కాంప్లెక్స్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా గంధం టవర్ యజమాని గంధం బాబు అలియాస్ వెంకటేశ్వరరావుతో మున్సిపాలిటీ అధికారులు అనుమతుల గురించి మాట్లాడారు. కమర్షియల్ కాంప్లెక్స్ కు అనుమతులు ఉన్నాయా అని అధికారులు ప్రశ్నించగా అనుమతులు లేవు.. కూలగొడితే కూలగొట్టండి అంటూ అధికారులు సాక్షిగా ఎద్దేవగా మాట్లాడారు. సదరు భవన యజమాని మాట్లాడిన తీరుతో అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. సదరు యజమాని వ్యంగ్యంగా మాట్లాడిన మున్సిపాలిటీ అధికారులు నోరు మెదపలేదు. కేవలం గంధం టవర్స్ లోని అపార్ట్ మెంట్లకు పన్ను చెల్లించాలని అక్కడున్న వారిని ఆదేశించారు. కమర్షియల్ భవనానికి అనుమతి లేదని యజమాని స్పష్టంగా చెప్పినప్పటికీ అధికారులు ఎలాంటి స్పందన లేదు.

ఆ విషయాన్ని వదిలిపెట్టి కేవలం గంధం టవర్స్ అనుమతి కాగితాలు రేపటికల్లా మున్సిపాలిటీ ఆఫీస్‌కు తీసుకువచ్చి అప్పగించాలని మాత్రమే ఆదేశించారు. అధికారుల పరిశీలన కేవలం కంటి తడుపు చర్యగా మారిందని గంధం టవర్స్ లో నివాసం ఉంటున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇంటి నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకోని నెల రోజులవుతుందని, అయినా నేటి వరకు ఇంటి నెంబర్లు అధికారులు కేటాయించలేదని గంధం టవర్స్‌లోని ప్రజలు వాపోయారు. కమర్షియల్ భవనానికి అనుమతులు లేవని యజమాని నేరుగా అధికారులకు చెప్పిన వారు ఆ సమయంలో కనీసం స్పందించకపోవడం చర్చినియాంసమైంది.

Advertisement

Next Story

Most Viewed