- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
రోడ్డు ప్రమాదంలో అశోక్ లేలాండ్ డ్రైవర్ మృతి
![రోడ్డు ప్రమాదంలో అశోక్ లేలాండ్ డ్రైవర్ మృతి రోడ్డు ప్రమాదంలో అశోక్ లేలాండ్ డ్రైవర్ మృతి](https://www.dishadaily.com/h-upload/2024/01/03/294183-accident.webp)
దిశ, తల్లాడ: లారీ మినీ వ్యాన్ (అశోక్ లేలాండ్)ను ఢీ కొట్టడంతో మినీ వ్యాన్ డ్రైవర్ దుర్మరణం చెందారు. ఈ ఘటన తల్లాడ- దేవరపల్లి జాతీయ రహదారి పై క్రీస్తు జ్యోతి కాలేజీ సమీపంలో బుధవారం ఒంటి గంట రాత్రి సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నుంచి కొబ్బరి బోండాలు వేసుకొని ఖమ్మం వైపు వస్తున్న అశోక్ లేలాండ్ వ్యాన్ ఖమ్మం నుంచి తల్లాడవైపు వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కొబ్బరి బొండాల వ్యాను డ్రైవర్ గొల్లపల్లి సుబ్బారావు (38) మృతి చెంది వాహనంలోనే ఇరుక్కుపోయాడు. ఈ సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై పి. సురేష్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని గంట పాటు శ్రమించి జేసీబీ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఏలూరు జిల్లా మున్సూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.