- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం.. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు..
దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం గ్రామీణ మండలం పల్లెగూడెం గ్రామపంచాయతీ పరిధిలో రెడ్డిపల్లి డంపింగ్ యార్డ్ విషయంలో ఎవరికి జరిమానా విధించాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తడి చెత్త, పొడి చెత్త స్వీకరించి, తడి-పొడి వేరు చేస్తూ, కంపోస్ట్ తయారుచేసి, రైతులకు విక్రయించాలని ప్రభుత్వ ఆదాయం పెంచాలని నిబంధనలు ఉన్నాయి. గత పది రోజులుగా డంపింగ్ యార్డ్ లో చెత్త కాలుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
దీనివలన కరుణగిరి నుండి మారెమ్మ గుడి వైపు వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన ప్రదేశంరోడ్డు పక్కనే ఉండటం వలన డంపింగ్ యార్డ్ నుండి తీవ్ర దుర్వాసనతో పాటు, పందులు, కుక్కలు, స్తైరవిహారం చేస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శి డంపింగ్ యార్డ్ వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదని గ్రామప్రజలు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, గ్రామప్రజలు కోరుకుంటున్నారు.