- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ ఎఫెక్ట్: మిర్చితోటపై కథనంపై స్పందించిన ఎమ్మెల్యే
X
దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంఅరేకోడు లోని మిర్చి రైతు సిలివేరు వెంకటనారాయణ గారి మిర్చి తోటని గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందుతో పంటను నాశనం చేసిన ఘటన పై 'దిశ' దినపత్రికలో 'మిర్చి తోట పై విషం ప్రయోగం' అనే కథనాన్ని ప్రచురించింది. దిశ కథనం పై స్పందించిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి రూరల్ మండల పార్టీ నాయకులను ఆదేశించడంతో బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు ఆధ్వర్యంలో మండల నాయకులు దెబ్బతిన్న తోటను పరిశీలించి, బాధిత రైతు వెంకటనారాయణను పరామర్శించారు. ఈ విషయాన్ని పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డికి తెలిపి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల రైతు కన్వీనర్ అక్కినేపల్లి వెంకన్న, సర్పంచ్ వెంకటనారయణ, సత్యనారాయణ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story