- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
50 పడకల ఆసుపత్రి, ఇరిగేషన్ కార్యాలయంకు శంకుస్థాపనలు చేసిన మంత్రులు
దిశ బ్యూరో, ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లురులో సోమవారం మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా కల్లూరు చేరుకున్న వారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత కల్లూరు మండల కేంద్రంలో రూ.10.50 కోట్లతో నిర్మింకానున్న 50 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
కల్లూరులో రూ.1.93 కోట్లతో నూతనంగా నిర్మించనున్న పర్యవేక్షక ఇంజనీర్, నీటి పారుదల శాఖ కార్యాలయ భవనాన్ని శంకుస్థాపన చేశారు. అనంతరం కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవించంద్ర, బండి పార్థసారథి రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతమ్, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.