CPM leader died : సీపీఎం నాయకుడికి పలువురు నివాళి

by Sridhar Babu |
CPM leader died : సీపీఎం నాయకుడికి పలువురు నివాళి
X

దిశ, వైరా : వైరా మండలంలోని విప్పలమడక గ్రామానికి చెందిన సీపీఎం నాయకుడు, సీనియర్ సభ్యుడు ముత్తమాల పులీపుకు పలువురు ఘన నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తమాల పులీపు (65) బుధవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు,

సీనియర్ నాయకులు తుమ్మల జాను పాపయ్య, గ్రామ శాఖ కార్యదర్శి కొల్లా వెంకటేశ్వరరావు, నాయకులు మేడా శరాబంది, రుద్రాక్షల వెంకటాచారి, గరిడేపల్లి మురళి,సామేలు, జోష్న, కళావతి, వెదుళ్ల పుల్లయ్య, కాంగ్రెస్ నాయకుడు కొల్లికొండ వీరభద్రం, హమాలీ కార్మికులు తదితరులు పులీపు మృతదేహంపై సీపీఎం జెండా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

Next Story