MP Balaram Naik : భద్రాద్రి అభివృద్ధికి నిధులివ్వండి..

by Sumithra |
MP Balaram Naik : భద్రాద్రి అభివృద్ధికి నిధులివ్వండి..
X

దిశ, భద్రాచలం : భద్రాద్రి అభివృద్ధికి నిధులు కేటాయించాలని పార్లమెంట్ లో మహబూబాబాద్ లోక్ సభ సభ్యులు పోరిక బలరాం నాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోదావరి పరివాహక ప్రాంతం, దక్షిణ అయోధ్య గా పిలువబడుతున్న తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయం అభివృద్ధికి, 25 కిలోమీటర్లు మేర కరకట్ట నిర్మించి, భద్రాచలం ఏజెన్సీ ప్రజలను గోదావరి ముంపు నుంచి రక్షించాలని కోరారు. దీని కోసం మూడు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని అన్నారు.

Advertisement

Next Story