- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోరం కనకయ్య రాజీనామా BRS పార్టీకి శుభ పరిణామం: దిండిగల రాజేందర్
దిశ, ఇల్లందు: కోరం కనకయ్య రాజీనామా బీఆర్ఎస్ పార్టీకి శుభపరిణామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. శనివారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడు నెలలుగా ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేని కోరం కనకయ్య.. ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్, ఇంకోసారి సొంత పార్టీ అంటూ గ్రూపు రాజకీయాలను నడిపి నేటికీ తెరదింపడం శుభ పరిణామమని ఎద్దేవా చేశారు. కోరం కనకయ్య తన వెంట 56 మంది సర్పంచులు, 24 మంది ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. కోరం కనకయ్యకు చేతనైతే సర్పంచులు, ఎంపీటీసీల పేర్లను బహిర్గతం చేసి శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
ఎమ్మెల్యేగా ఓడిపోయిన కోరం కనకయ్యకు జడ్పీ చైర్మన్ పదవి ఇస్తే.. కన్న తండ్రి లాంటి కేసీఆర్‌ను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లే విమర్శించారు. ఎవరైతే పార్టీ మారారో వారు పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ బలమని, సంక్షేమ పథకాలే బలగమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండి పోడు మీద ఆధారపడి జీవన సాగిస్తున్న గిరిజనులకు నేడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలలో చర్చించి తీర్మానాలు చేయించి పోడు సమస్యకు శాశ్వతంగా పట్టాలు అందిస్తుందన్నారు.
నేడు ప్రతి గిరిజన రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని.. అటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే పుట్టగతులు లేకుండా పోతావని హెచ్చరించారు. కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు హరి సింగ్ నాయక్, పులిగళ్ల మాధవరావు, సుదర్శనం రంగనాథ్, శ్రీనివాస్ రెడ్డి, యలమద్ది రవి, జెకె శీను, పరుచూరి వెంకటేశ్వర్లు, మనోజ్ తివారి తదితరులు పాల్గొన్నారు.