- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Godavari river : భద్రాద్రి వద్ద నిలకడగా గోదావరి..
దిశ, భద్రాచలం : సోమవారం మధ్యాహ్నం 2.04 గంటలకు గోదావరి 48 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తర్వాత క్రమేపి పెరుగుతూ, మంగళవారం ఉదయం 8 గంటలకు 51.60 అడుగులకు పెరిగిన గోదావరి 11 గంటల నుండి తగ్గుముఖం పట్టింది. బుధవారం తెల్లవారుజాము 3.51 గంటలకు 47.9 అడుగులకు తగ్గడంతో రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి మళ్ళీ పెరుగుతూ వస్తుంది.సి డబ్ల్యూ సీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు మధ్యాహ్నం 12 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక 48 అడుగులకు చేరుకుంది.
కాని కలెక్టర్ కార్యాలయం నుండి వెలువడిన ప్రకటన ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు గోదావరి 48 అడుగులకు చేరుకుందని తెలుపుతూ, రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మూడు రోజుల వ్యవధిలో మరోమారు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు 48.6 అడుగులు మేర గోదావరి నిలకడగా ప్రవహిస్తుంది. అర్దరాత్రి నుంచి గోదావరి తగ్గే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు పేర్కొన్నారు.