ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం

by Sridhar Babu |   ( Updated:2024-03-15 16:32:21.0  )
ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం
X

దిశ,సత్తుపల్లి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు రాజకీయ దురుద్దేశమేనని సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని మండిపడ్డారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముంగిట ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత‌ను అరెస్ట్ చేయ‌డమేమిట‌ని ప్రశ్నించారు. ఈడీ అధికారులు చ‌ట్టానికి వ్య‌తిరేకంగా

వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారని, బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీని బలహీన పరిచేందుకు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ రేపు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed