- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం జిల్లా ఆసుపత్రికి ‘బీఎఫ్‌హెచ్‌ఐ’ గుర్తింపు
by Satheesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం జిల్లా దవాఖానకు ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్’ గుర్తింపు దక్కింది. ముర్రుపాలు అందించడం, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే దవాఖానలకు 'బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్(బీఎఫ్‌హెచ్‌ఐ)లో భాగంగా ఈ సర్టిఫికెట్‌ను అందజేశారు. ఖమ్మంతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు దవాఖానలు బీఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపు పొందాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాన్సువాడలోని ఎంసీహెచ్ మొదటి బీఎఫ్‌హెచ్‌ఐ సర్టిఫికెట్ సాధించింది. ఆ తర్వాత జనగాం ఎంసీహెచ్, గజ్వేల్ ఏరియా హస్పిటల్, సూర్యాపేట ఎంసీహెచ్, జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ ఈ గుర్తింపు పొందాయి. తద్వారా దేశంలోనే అత్యధిక బీఎఫ్‌హెచ్‌ఐ అక్రిడేటెడ్ ప్రభుత్వ దవాఖానలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది.
Advertisement
Next Story