- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్ సభకు అడ్డంకులు.. క్లారిటీ ఇచ్చిన ఖమ్మం సీపీ
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ నిర్వహిస్తున్న జనగర్జన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించడంలేదని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ స్పష్టం చేశారు. సభకు వెళ్తున్న వారి వాహనాలు అడ్డకుంటున్నామన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ట్రాఫిక్ డైవర్షన్ మినహా ఎక్కడా చెక్ పోస్టులు లాంటివి పెట్టలేదని వెల్లడించారు. సభకు వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేయొద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకముందు ఖమ్మం సభకు వచ్చే వాహనాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన చివిషయం తెలిసిందే. రేవంత్ అభ్యర్థనపై స్పందించిన డీజీపీ అంజనీ కుమార్.. ఖమ్మంలో కాంగ్రెస్ సభకు వెళ్లే వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.