- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నామినేటెడ్ పోస్టుల్లో వారికే మొదటి ప్రాధాన్యత
దిశ, వెబ్‌డెస్క్: నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలలోపు భర్తీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన వారికి నామినేటెడ్ పోస్టుల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ హామీ ఇచ్చిన నేతల జాబితా సిద్ధం చేయాలని ఏఐసీసీ ఇన్‌చార్జులకు అధిష్టానం సూచించింది. ఇదిలా ఉండగా.. నామినేటెడ్ పోస్టులపై అనేక మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు.
స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే పైరవీలు ప్రారంభించారు. లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు, రాష్ట్రస్థాయిలో తమకున్న పరిచాయాలతో ఆశావాహులు తెగ పావులు కదుపుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన వారు, పార్టీకోసం శ్రమించిన వారిపై అధిష్టానం దృష్టి పెట్టింది. OC, BC, SC, ST సమీకరణలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి ఎంత మందికి పోస్టులు దక్కుతాయే తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.