- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Whatsapp: వాట్సాప్‌లో మరిన్ని ప్రైవసీ ఫీచర్లు.. ఇకపై వాటికి పర్మిషన్ తప్పనిసరి!

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) గురించి ప్రస్తుతం తెలియని వారుండరు. స్మార్ట్ ఫోన్ (Smartphone) ప్రతి ఒక్కరూ వాట్సాప్ వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ కూడా యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పటికే వాట్సాప్‌లో అనేక ప్రైవసీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానుంది.
సాధారణంగా మనం వాట్సాప్‌లో ఎవరికైనా ఫొటోలు (Photos), వీడియోలు(Videos), ఆడియోలు (Audios) పంపితే వారి గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతం తీసుకురాబోతున్న ఫీచర్ ద్వారా అవతలి వారు సేవ్ చేసుకోకుండా నియంత్రించే సదుపాయాన్ని అందించనుంది. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ మోడ్‌లో ఉంది.
ఇందుకోసం మనం పంపే ఫొటోలు, వీడియోలు వారు గ్యాలరీలో సేవ్ చేసుకోకుండా ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఓ ఆప్షన్‌ను ఇవ్వనుంది. దీనిని ఆన్ చేసుకున్నప్పుడు.. అవతలి వ్యక్తులు ఆ ఇమేజ్‌ను లేదా వీడియో సేవ్ చేయాలనుకున్నప్పుడు 'సేవ్ చేయడం కుదరదు' అనే సందేశం కనిపిస్తుంది. దీన్ని ఆఫ్ చేసుకున్నప్పుడు అవతలి వారు సేవ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మరికొన్ని ప్రైవసీ సంబంధిత ఫీచర్లను వాట్సప్ తీసుకురాబోతోందని వాట్సప్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించే వాబీటా ఇన్ఫో పేర్కొంది. ఈ ఫీచర్లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయని, బీటా ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ అయిన యూజర్లకు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిపింది.