కేసీఆర్ పతనం ఖాయం : సంగప్ప

by Naresh |   ( Updated:2023-08-24 12:08:34.0  )
కేసీఆర్ పతనం ఖాయం : సంగప్ప
X

దిశ, నారాయణఖేడ్: యావత్ భారతదేశం‌లో అసెంబ్లీ సాక్షిగా అబద్ధపు హామీలు ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపుమేరకు నారాయణఖేడ్ లో బీజేపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే అసాధ్యమైన హామీలను కురిపించి, ఒకరిద్దరికి ఇచ్చి మిగతా వారిని ఆశల్లో విహరింప చేసే జిత్తులమారి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. 2018 ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చిన కేసీఆర్ నేటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం ఆయన మోసకారితనానికి అద్దం పడుతుందని సంగప్ప అన్నారు. సరిగ్గా ఎన్నికలు దగ్గరికి రావడంతో బీసీ బంధు, మైనారిటీ బంధు, దళిత బంధు లాంటి అబద్ధపు, అసాధ్యపు పథకాలు ప్రకటించి రాష్ట్రానికి రాబందుల తయారయ్యారని మండిపడ్డారు. ఈ ముట్టడిలో పాల్గొన్న విజయపాల్ రెడ్డి, రజనీకాంత్ సుగుణాకర్ జై, శివ, రమేష్, సంజు పాటిల్, రాజూ గౌడ్, సాయిరాం లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed