- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేగా KCR ఓటమి.. విజయశాంతి ఆసక్తికర ట్వీట్!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఎన్నికల వేళ బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఇక, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంపై విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇద్దరే ఎంపీలుగా తెలంగాణకై కొట్లాడిన నాటి నుంచి మా మధ్య విధానపరంగా అనేక వ్యతిరేకతలు ఉన్నా, నేను అన్నా అని పిలిచి, గౌరవంతో కలిసి పనిచేసిన కేసీఆర్ గారు తానే స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఓటమి పొందిన స్థితికి తెలంగాణల బీఆర్ఎస్ పార్టీని ఇయ్యాల తెచ్చుకోవడం బాధాకరం.
మొదట కేసీఆర్ గారు ఎన్నో పర్యాయాలు చెప్పినట్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, కాదంటే 2018 ఎన్నికల తర్వాత కావచ్చు, పదవికి దూరంగా ఉంటే ఇయ్యాల్టి ఈ పరిణామాలు వారికి ఉండకపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా ఏర్పడనున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల గౌరవంతో కూడిన ప్రతిపక్ష హుందాతనాన్ని కేసీఆర్ గారు, బీఆర్ఎస్ నుండి తెలంగాణ సమాజం ఎదరుచూస్తున్నది.’ అంటూ రాసుకొచ్చారు.