- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రతిపక్ష నేతగా దళిత ఎమ్మెల్యే.. నిర్ణయం తీసుకున్న కేసీఆర్?
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిపక్ష నేత హోదాలో సర్కారును ఎండగట్టేందుకు మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తారని ఆశపడ్డ గులాబీ ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. నేటితో అసెంబ్లీ సెషన్ ముగుస్తుండగా.. కేసీఆర్ ఎందుకు రావడం లేదనే చర్చ ఆ పార్టీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నది. అధికార పక్షం నుంచి వచ్చే విమర్శలను వినడం ఇష్టం లేకనా? లేక వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకే సభకు రావడం లేదా? అని వారు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
అప్పుడు రాలే.. ఇప్పుడూ రాలే..
కొత్త అసెంబ్లీ ఎన్నికైన తరువాత గతేడాది డిసెంబర్ 9న సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. ఆ తరువాత ఐదు రోజులపాటు సభ కొనసాగింది. ఆ సమయంలో కేసీఆర్ అస్వస్థతకు గురికావడంతో సమావేశాలకు రాలేకపోయారు. ఈనెల ఒకటో తేదీన కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సభకు వస్తారని అందరూ అనుకున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ‘సార్ అసెంబ్లీకి వస్తుండు’ అని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈనెల 8 నుంచి జరుగుతున్న సమావేశాలకు కేసీఆర్ రాలేదు. అయితే సభలో బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలను తప్పుపడుతూ అధికారపక్షం పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. వాటిపై కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్ సభకు వస్తారని గులాబీ ఎమ్మెల్యేలు ఆశపడ్డారు. ఆయన మాత్రం సభకు రాకుండా నల్లగొండలో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో ప్రతివిమర్శలు చేశారు.
కేసీఆర్ రూట్.. సెపరేట్..
రాజకీయాల్లో కేసీఆర్ ఏ హోదాలో ఉన్నా.. అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తారనే టాక్ ఉంది. సీఎం గా ఉన్నప్పుడు ఆయన రెగ్యులర్ గా సెక్రటేరియట్ కు రాలేదని విమర్శలు ఫేస్ చేశారు. కొత్త సెక్రటేరియట్ అందుబాటులోకి వచ్చే వరకు ఆయన అటు వైపునకు కూడా రాలేదు. సీఎం ఎక్కడ ఉన్న నిర్నయాలు జరుగుతున్నాయి కదా? అందుకోసం సెక్రటేరియట్ కే రావాలా? అని బీఆర్ఎస్ లీడర్లు ఎదురు ప్రశ్నించేవారు. ఉద్యమ సమయంలో ఎంపీగా పార్లమెంట్ కు వెళ్లిన సందర్భాలు చాలా తక్కువని, ఆయనకు ఇష్టం ఉన్నప్పుడే సభకు వెళ్లేవారని గులాబీ లీడర్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో బడ్జెట్ సమావేశాలకు హాజరై తన వాదన పటిమతో సీఎం రేవంత్ రెడ్డిని ఎటాక్ చేస్తారని ఆశపడ్డ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు నిరాశే మిగిలింది. అయితే సభకు వస్తే, కాంగ్రెస్ నుంచి వచ్చే విమర్శలు, హేళనలు, అవమానాలు జరుగుతాయని భావించే అసెంబ్లీ కు రాకుండా ఉంటున్నారేమోనని ప్రచారం ఉంది.
కేసీఆర్ కోసం ఎదురుచూపు..
అసెంబ్లీలో చర్చలు జరుగుతున్న సమయంలో సీఎం సభలో ఉండాలని విపక్షాలు డిమాండ్ చేయడం సహజం. కానీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో అపోజిషన్ లీడర్ సభకు రావాలని అధికార పక్షం డిమాండ్ చేయడం కొత్తగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రూలింగ్ పార్టీ పదే పదే డిమాండ్ చేసినా కూడా ఆయన సభలో అడుగుపెట్టకపోవడం వెనుక ఏదో బలమైన కారణమే ఉంటుందని అనుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలను ఆయన ముందే సభలో పెట్టి, ఆయన్ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ఆశగా ఎదురుచూసింది. కానీ ఆయన సభకు రాకపోవడంతో అసెంబ్లీ చివరి రోజున ఇరిగేషన్ పై వైట్ పేపర్ రిలీజ్ కు సిద్ధమైంది.
వచ్చే సెషన్‌కు కొత్త అపోజిషన్ లీడర్?
భవిష్యత్తులోనైనా కేసీఆర్ సభకు వస్తారా? లేదా? అనే డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు జులైలో జరుగనున్నాయి. ఈలోపు పార్లమెంట్ ఎన్నికలు జరిగి, ఫలితాలు కూడా వస్తాయి. ఒకవేళ కేసీఆర్ లోక్ సభకు పోటీచేసి గెలిస్తే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశముంటుంది. అప్పుడు ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం తప్పనిసరి. దీంతో వచ్చే అసెంబ్లీ సెషన్ సమయానికి అపోజిషన్ లీడర్ పదవిని దళిత ఎమ్మెల్యేకు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తున్నది.