కేసీఆర్ ఓ ఫ్లెక్సీ కింగ్! మెట్రో కొత్త రూట్లో వెలిసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలపై సెటైర్లు

by Nagaya |
కేసీఆర్ ఓ ఫ్లెక్సీ కింగ్! మెట్రో కొత్త రూట్లో వెలిసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలపై సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెట్రో రెండో దశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన సందర్భంగా మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి సెటైర్లు వేశారు. మెట్రో కొత్త రూట్లో రోడ్డుకు ఇరువైపుల బీఆర్ఎస్ నేతలు పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. 'కొత్త మెట్రో మార్గానికి శంకుస్థాపన చేసిన ఫ్లెక్సీ కింగ్ కేసీఆర్' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజానికి కేసీఆర్ పాత రూట్లలో మెట్రో మార్గాలను విస్తరించడం పూర్తిగా మర్చిపోయాడని ఆ పనులను అలాగే పెండింగ్ లో ఉంచి కొత్త రూట్లో మెట్రో పనులకు శంకుస్థాపన చేస్తున్నాడన్నారు. భారత దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెబుతున్న ఫ్లెక్సీ కింగ్ కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మర్చిపోయాడని విమర్శించారు.



Next Story

Most Viewed