- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: సికింద్రాబాద్ BRS ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు పెంచారు. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ.. అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగానూ కేసీఆర్ ఇప్పటి వరకు 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ఫిక్స్ చేశారు. సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ ఇవాళ సమావేశం నిర్వహించారు.
పార్టీ సీనియర్ నేతగా, నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారని.. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ అభ్యర్థిత్వానికి సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో అందరి ఏకాభిప్రాయం మేరకు పద్మారావు గౌడ్‌ను ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ అనౌన్స్ చేశారు. కాగా ఇప్పటి వరకు 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మరో 3 సెగ్మెంట్లకు క్యాండిడేట్లను అనౌన్స్ చేయాల్సి ఉంది. హైదరాబాద్, భువనగిరి, నల్లగొండ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ మూడు స్థానాలకు సైతం అభ్యర్థుల ఎంపిక పూర్తైందని.. త్వరలోనే అధికారికంగా క్యాండిడేట్ల పేర్లను అనౌన్స్ చేయనున్నట్లు టాక్.