బీజేపీ నాయకులపై కోర్టుకు రెండోసారి రిమాండ్ రిపోర్ట్

by Sathputhe Rajesh |
బీజేపీ నాయకులపై కోర్టుకు రెండోసారి రిమాండ్ రిపోర్ట్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట ఘర్షణల్లో నిందితులుగా పేర్కొన్న బీజేపీ నాయకులపై శనివారం అర్థరాత్రి పోలీసులు సిరిసిల్ల కోర్టులో రెండోసారి రిమాండ్ రిపోర్ట్ ను సమర్పించారు. గురువారం రాత్రి టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఎల్లారెడ్డిపేటలో గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు 23 మంది బీజేపీ నాయకులను అరెస్టు చేసి సిరిసిల్ల కోర్టులో మొదట హాజరుపర్చారు. అయితే నిందితుల అరెస్టు విషయం కుటుంబ సభ్యులకు తెలపలేదంటూ రిమాండ్ ను సిరిసిల్ల మెజిస్ట్రేట్ తిరస్కరించారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మరోసారి సిరిసిల్ల కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ అందజేశారు. దీంతో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి సహా 23 మందిని జ్యుడిసియల్ రిమాండ్ కు తరలించాలని సిరిసిల్ల కోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story