- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెలవెలబోతున్న తెల్ల బంగారం
బస్తాల్లో పత్తికి తగ్గిన ధర.. రైతన్నలు బేజారు
దిశ, జమ్మికుంట : జమ్మికుంట పత్తి మార్కెట్లో బస్తాల్లో తీసుకువచ్చిన పత్తికి తక్కువ ధర పలుకుతోంది. విడి పత్తికి మాత్రం గత రెండు రోజులుగా ఒకే ధరతో పత్తి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం బస్తాల్లో 15 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రావడంతో క్వింటాలుకు గరిష్ట ధర రూ.6,900లు, కనిష్ట ధర రూ.5 వేలు, మోడల్ ధర రూ.6 వేలు పలకగా, బుధవారం మాత్రం బస్తాల్లో వచ్చిన పత్తికి గరిష్ట ధర రూ.6,800, కనిష్ట ధర రూ.5 వేలు, మోడల్ ధర రూ.6వేలతో ఖరీదుదారులు పత్తిని కొనుగోలు చేశారు.
రెండు రోజుల్లో బస్తాల్లో వచ్చిన పత్తి ధరలను పరిశీలించినట్లయితే గరిష్ట ధరలో రూ.100 తగ్గగా మోడల్ ధరలో మాత్రం రూ.6వేలకు తగ్గింది. కాగా, బుధవారం 27 వాహనాల్లో 298 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి రాగా, గరిష్ట ధర రూ.7,350, కనిష్ట ధర రూ.7వేలు, మోడల్ ధర రూ.7,250 లు పలికింది. బస్తాల్లో 10 క్వింటాళ్ల పత్తి క్రయానికి రాగా, పత్తికి గరిష్ట ధర రూ.6,800, కనిష్ట ధర రూ.5వేలు, మోడల్ ధర రూ.6వేలతో పత్తి వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఇదే రేటుతో మరికొద్ది రోజుల పాటు పత్తి వ్యాపారులు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.
Also Read...
రైతులకు బిగ్ అలర్ట్.. ఆ రకం వరి సాగు చేయవద్దని కలెక్టర్ ఆదేశాలు