- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SP Akhil Mahajan : విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలి
దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సమస్యలతో స్టేషన్ కు వచ్చే ప్రజల ఫిర్యాదులు స్వీకరించి ఎలాంటి జాప్యం చేయకుండా వాటి పరిష్కారానికి, విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆయన జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో నేరస్తులను పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానం తో పాటు సీసీ కెమెరాలను ఉపయోగించి చేధించాలని అధికారులకు తెలిపారు. కేసు నమోదైన వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, స్టేషన్ అధికారులు ప్రతి రోజు పెండింగ్ కేసులను సమీక్షా జరపాలని, దర్యాప్తులో వున్న కేసుల్లో బాధితులకు వీలైనంత వరకు న్యాయం చేయాలని సూచించారు.
డీఎస్పీ స్థాయి, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు తరచు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను సందర్శిస్తూ స్టేషన్ పరిధిలో నమోదు అయ్యే నేరాలు తదితర అంశాలపై రివ్యూ చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్ల పట్ల, హిస్టరీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించడం తో పాటు వారిపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సోషల్ మీడియా నిఘా ఉంచి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్తులు చేసే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో గంజాయి క్రయ, విక్రయాలు, అక్రమ రవాణాపై నిఘా ఉంచి నిర్ములిస్తూ, యువత గంజాయి బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నేరాల చెదనలో సీసీ కెమెరాల పాత్ర ప్రజలకు వ్యాపారస్తులకు తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్చందంగా ముందుకు వచ్చిలా అవగాహన కల్పించాలని, సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లో 100 మంది కన్నా ఎక్కువ జనసంచారం ఉండే వ్యాపార ,వాణిజ్య సంస్థల్లో తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎంఫైర్ మెంట్ యాక్ట్ లో భాగంగా సీసీ కెమెరాలు ఉండాలన్నారు.
ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి తనిఖీ చేసిన సమయంలో సీసీ కెమెరాల లేకున్నా, పని చేయకున్నా సంబంధిత యజమానిపై తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎంఫైర్ మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు సూచి బోర్డ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, మురళి కృష్ణ, సిఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మధుకర్, శ్రీనివాస్, శ్రీలత, ఆర్ఐ లు మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్ఐ లు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.