- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా భర్త ఆమెను కొట్టలేదు .. ఆర్టీసీ బస్సు ఘటనపై ఎస్‌ఐ భార్య
దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాలలో సంచలనంగా మారిన ఆర్టీసీ బస్సు ఘటనలో జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్‌ను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఘటనపై స్పందించిన ఎస్సై అనిల్ భార్య సంధ్య మీడియాతో మాట్లాడుతూ బస్సులో జరిగిన సంఘటన గురించి వివరించారు. మంగళవారం సాయంత్రం జగిత్యాల వచ్చేందుకు తన ఇద్దరు పిల్లలతో కరీంనగర్‌లో బస్సు ఎక్కానని అన్నారు.
ఈ క్రమంలో తన బిడ్డకు పాలు ఇవ్వడం కోసం సీటు ఇవ్వాలని యువతిని కోరగా సీటు ఇవ్వకపోగా తనపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఒక దశలో కండక్టర్ సీటు ఇవ్వాలని చెప్పినప్పటికీ ఇవ్వకుండా అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. మతాలను కించపరిచే విధంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. జగిత్యాల వచ్చాక చెప్తామంటూ సదరు యువతి ఆమె తల్లి కొంతమంది వ్యక్తులకు ఫోన్ చేస్తున్న విషయం గమనించి భయంతో తాను ఏడ్చుకుంటూ తన భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పినట్లు వివరించారు. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉన్న ఆర్టీసీ డిపో స్టాప్ వద్ద దిగుతానని చెప్పడంతో తన భర్త అక్కడికి పికప్ చేసుకోవడానికి వచ్చాడని.. ఈ క్రమంలో జరిగిన విషయమై యువతిని ఆరా తీస్తున్న క్రమంలో వీడియో తీస్తున్న విషయం గమనించి తానే ఫోన్ లాక్కున్నట్లుగా తెలిపారు.
ఫోన్ తీసుకునే క్రమంలో కింద పడింది తప్ప ఉద్దేశపూర్వకంగా పడేయలేదన్నారు. మరో వైపు తన భర్త అనిల్ సివిల్ డ్రెస్‌లో స్లిప్పర్స్ వేసుకుని వచ్చాడని కానీ సదరు యువతి మాత్రం బూట్ కాళ్లతో తన్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. యువతితో జరిగిన పెనుగులాటలో తన చేతికి కూడా గాయాలు అయ్యాయని అన్నారు. తన భర్త అనిల్ యువతిపై ఎలాంటి దాడి చేయలేదని ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు.