Big Breaking News : కరీంనగర్‌లో గులాబీ పార్టీకి భారీ షాక్‌

by M.Rajitha |
Big Breaking News : కరీంనగర్‌లో గులాబీ పార్టీకి భారీ షాక్‌
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం రేగింది. కరీంనగర్‌(Karimnagar)లో గులాబీ పార్టీకి బిగ్‌షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌(BRS) కు చెందిన కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు(SunilRao) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అదే విధంగా మేయర్‌తో పాటు 10 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడారు. కారు దిగిన వీరంతా కమలం పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay) సమక్షంలో రేపు వీరంతా బీజేపీ(BJP)లో చేరనున్నారు. కాగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలయ్యాక ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే గులాబీ పార్టీకి చెందిన మరికొంతమంది ముఖ్య నాయకులు కూడా హస్తం పార్టీలో చేరగా.. తాజాగా మేయర్లు కూడా ఇతర పార్టీల బాట పట్టారు.

Next Story

Most Viewed