- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా
దిశ, జగిత్యాల ప్రతినిధి: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ వాటిని ఆయా శాఖలకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని తెలిపారు.
అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 36 ఫిర్యాదులు, వినతులు స్వీకరించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మకరంద, కొరుట్ల ఆర్డీవో, వినోద్ కుమార్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.