సెల్ టవర్ ఎక్కి వృద్ధుడు హల్​చల్​ ...ఆ విషయంలో అన్యాయం చేశారని ఆవేదన

by Sridhar Babu |   ( Updated:2025-02-16 14:49:29.0  )
సెల్ టవర్ ఎక్కి వృద్ధుడు హల్​చల్​ ...ఆ విషయంలో అన్యాయం చేశారని ఆవేదన
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలో ఓ వృద్ధుడు సెల్ఫోన్ టవర్ పైకి ఎక్కి కాసేపు హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే....సైదాపూర్ మండలం ఏక్లాస్ పూర్ గ్రామానికి చెందిన దుర్గం కొమురయ్య అనే వృద్ధుడు తన సోదరుడైన తిరుపతి తన భార్య పైన దాడి చేసి తన రేకుల షెడ్డును కూల్చి వేశాడని, దీంతో మనస్థాపానికి గురైన తన భార్య క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపాడు. ఈ విషయంపై సైదాపూర్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం చేయడం లేదని వాపోయాడు.

దీంతో గత్యంతరం లేక సమస్య పరిష్కారానికి కేశవపట్నం గ్రామంలో ఆత్మహత్య చేసుకోవడానికి సెల్ఫోన్ టవర్ ఎక్కినట్లు తెలిపాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగి వచ్చాడు. దీంతో సదరు వ్యక్తిని కేశవపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయంపై సైదాపూర్ ఎస్సైని వివరణ అడగగా అన్నదమ్ముల మధ్య వివాదం విషయంలో వారి తమ్ముడిపై కేసు నమోదు చేశామని, పోలీసుల అలసత్వం లేదని తెలిపారు.

Next Story

Most Viewed