- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రోగులను ఇతర బ్లాకులకు తరలించండి

దిశ, గోదావరిఖని : ఆసుపత్రిలో ఉన్న రోగులను ఇతర వార్డులోకి తరలించి ఆసుపత్రి ఫ్లోరింగ్ రెన్నోవేషన్ పనులు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలో ప్రసవ విభాగం, పేయింగ్ రూమ్స్, రిసెప్షన్ కౌంటర్, హెల్ప్ డెస్క్, అవుట్ పేషెంట్ విభాగాలను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనరల్ ఆసుపత్రిలో చేపట్టే ఫ్లోరింగ్ రెన్నోవేషన్ పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న విభాగాల్లోని రోగులను, వైద్య పరికరాలను ఆసుపత్రిలో ఇతర భవనాలకు షిప్ట్ చేసి ఫ్లోరింగ్ రెన్నోవేషన్ పనులు ప్రారంభించాలని కోరారు.
ఆస్పత్రిలో ఫ్లోరింగ్ రెన్నోవేషన్ కోసం సంబంధిత ఏజెన్సీలకు ముందు కొంత విభాగాన్ని అప్పగించాలని, అక్కడ ఫ్లోరింగ్ ముగిసిన వెంటనే మరో విభాగాన్ని అప్పగించి ప్రణాళిక ప్రకారం పనులు పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. రోగులను షిఫ్ట్ చేసే చోట వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలు, శస్త్ర చికిత్సలు, ఔట్ పేషంట్ వివరాలు తెలుసుకొని మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు సింగ్, డాక్టర్ రాజు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.