- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడపిల్ల ఇంట్లో వెలుగు నింపేందుకే 'కళ్యాణ లక్ష్మి' : ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
దిశ, రామడుగు : ప్రతి ఆడబిడ్డ ఇంట్లో వెలుగులు నింపేందుకే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. మంగళవారం రామడుగు మండలంలోని 66 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎంపీడీవో కార్యాలయంలో చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇవ్వలేని దుస్థితి ఉండేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.
కరోనా లాంటి సంక్షోభంలో కూడా సీఎం కేసీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో లేకున్నా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు రాష్ట్రంలో అమలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమనన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాజకుమార్, బీ.ఆర్.ఎస్ మండలాధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తిరుపతి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు ఎడవల్లి నరేందర్ రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు షుకూర్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు బండ అజయ్ రెడ్డి, నాయకులు పూడూరి మల్లేశం, పాపిరెడ్డి, పైన్ల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
Read More: వరంగల్ జైల్‌ను కుదువ పెట్టిన KCR.. బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు