- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవన్ రెడ్డి.. ప్రజలను తప్పుదోవపట్టించడం మానుకోవాలి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
దిశ, జగిత్యాల ప్రతినిధి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ లను కష్టపెడుతోందని మాట్లాడిన జీవన్ రెడ్డి అన్ని తెలిసినా... కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఎంపీ అరవింద్ ను ఎందుకు ప్రశ్నించడం లేదని విమర్శించారు.
జీవన్ రెడ్డి అనుసరిస్తున్న ద్వంద వైఖరిని విడిచిపెట్టాలని అన్నారు. కేవలం కేసీఆర్ టార్గెట్ గానే జీవన్ రాజకీయాలు చేస్తాడని గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మకైన సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు. బీజేపీతో మూలాఖతై బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడమే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని మండి పడ్డారు. గిరిజన యూనివర్సిటీ, నవోదయ విద్యాలయం, ఎన్టీపీసీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన 4 వేల మెగావాట్ల విద్యుత్ వంటి ఎన్నో విషయాలు ఉన్నా ఏనాడు జీవన్ రెడ్డి కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలోనే పల్లెల అభివృద్ధి జరుతున్న విషయం జీవన్ రెడ్డి గుర్తెరగాలని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే జీవన్ రెడ్డి బీజేపీతో కలిసి పని చేసిన ముచ్చట ప్రజలందరికీ తెలుసని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని జీవన్ రెడ్డి డమ్మిగా మార్చడం ఖాయమని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని నిజం గడప దాటక ముందే అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తోందని ఇటీవలే నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఇది వారి విజ్ఞతకే వదిలేశానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత జీవన్ రెడ్డికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బాల ముకుందం, సర్పంచ్ ల ఫోరం చెరుకు జాన్, గంగాధర్, పాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, సందీప్ రావు, తదితరులు పాల్గొన్నారు.