Food Inspector : మల్యాలలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు..

by Sumithra |
Food Inspector : మల్యాలలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు..
X

దిశ, మల్యాల : మండలంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష సోమవారం వివిధ దుకాణాలలో తనిఖీలు చేపట్టారు. మార్కండేయ గుడి సమీపంలో గల బెంగళూరు బేకరీలో ఫంగస్ వచ్చినటువంటి కేకులను, బిస్కెట్, తోస్, మిల్క్ క్రీమ్ వంటి వస్తువులు సమయం ముగిసినా నిలువ ఉంచడంతో ఆ బేకరీ పై చర్యలు చేపట్టారు. ఆ బేకరీని వారం రోజులు మూసివేయాలని షాప్ యజమానికి ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష మాట్లాడుతూ కాలం చెల్లిన వస్తువులను షాపులలో ఉంచకూడదని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆమె కోరారు.

Advertisement

Next Story