భార్యను కత్తితో పొడిచి.. భర్త ఆత్మహత్య

by Shiva |
భార్యను కత్తితో పొడిచి.. భర్త ఆత్మహత్య
X

దిశ, గొల్లపల్లి: తాగిన మైకంలో భార్యతో గొడవ పడి ఆమెను కత్తితో పొడిచి భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘటన గొల్లపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన అనంతుల రాకేష్ కు 11ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య, భర్త ఇద్దరూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఏడాదిన్నర క్రితం రాకేష్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ కి వెళ్లి అక్కడ సరైన పని దొరక్క ఆరు నెలల క్రితం స్వగ్రామానికే వచ్చాడు. దీంతో తనకు అప్పులు ఎక్కువైయ్యాయని, వాటిని ఎలా తీర్చాలని భార్యతో చెప్తూ బాధపడేవాడు. ఈ క్రమంలో రాకేష్ పూర్తిగా మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు.

ఎప్పటి లాగే మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చాడు, భార్యతో వాగ్వాదానికి దిగి, క్షణికావేశంలో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి ఇంటి నుంచి పారిపోయాడు. బుధవారం ఉదయం గ్రామ శివారులోని ఓ చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed