- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదంగా మారిన టీచర్ సస్పెన్షన్
దిశ, జగిత్యాల ప్రతినిధి : ఇంటర్ ఎగ్జామ్స్ ఇన్విజిలేషన్ డ్యూటీలకు హాజరుకాకపోవడంతో డ్యూటీ సర్టిఫికెట్లు ఫేక్ సమర్పించారనే ఆరోపణల నేపథ్యంలో సారంగాపూర్ మండలం భీమిరెడ్డి గూడెంలో పనిచేస్తున్న ప్రభుత్వ టీచర్ అనితను సస్పెండ్ చేస్తూ డీఈవో జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ సస్పెన్షన్ కు రాజకీయ రంగు పులుముకోవడంతో వివాదాస్పదంగా మారింది. ఇంటర్ ఎగ్జామ్స్ కోసం కొన్ని మండలాలకు చెందిన ప్రభుత్వ టీచర్ల కు ఇన్విజిలేషన్ డ్యూటీలు అప్పగించారు.
వీరు మార్చి 14న రిలీవ్ ఆర్డర్ తీస్కొని మార్చి 15 నుంచి ఏప్రిల్ 01 వరకు డ్యూటీకి వెళ్లాల్సి ఉంది. కానీ, ఇందులో కొందరు డ్యూటీకి వెళ్లకుండా అటు స్కూల్ కు వెళ్లకుండా సాలరీ తీసుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వ టీచర్ సస్పెన్షన్ కు గురైంది. అయితే, కొందరు రాయికల్ మండలంలో కూడా డ్యూటీ చేయని టీచర్లు ఉన్నా అధికార పార్టీ ఒత్తిడితో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ విచారణ జరిపి డ్యూటీలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీచర్స్, స్టూడెంట్స్ యూనియన్లు కోరుతున్నాయి.