Nandi Pump House : నంది పంప్ హౌస్ ను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు..

by Sumithra |
Nandi Pump House : నంది పంప్ హౌస్ ను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు..
X

దిశ, ధర్మారం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి గోదావరి జలాలను తరలింపు చేస్తుంటే, బీఆర్ఎస్ నాయకులు తమ ఘనతే అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి మండిపడ్డారు... ధర్మారం మండలంలోని నంది పంప్ హౌజ్ వద్దనున్న డెలివరీ సిస్టంను, మండల కాంగ్రెస్ నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఇచ్చిన వార్నింగ్ తోనే సీఎం రేవంత్ రెడ్డి భయపడి, పంపులను ప్రారంభించారని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు.

కడెం నుంచి ఎల్లంపల్లికి వచ్చిన నీటిని నంది పంప్ హౌస్ ద్వార తరలింపు చేస్తుంటే, వాటిని కాళేశ్వరం జలాల తరలింపు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలనలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని, అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, దానిని నిర్మాణం చేయకుండా రైతాంగాన్ని మోసం చేశారని ఆరోపించారు. నంది పంప్ హౌజ్ ద్వారా వస్తున్న నీటిని కాళేశ్వరం జలాలుగా నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులూ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story