- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారు : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
దిశ, కాల్వ శ్రీరాంపూర్ : బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాసమస్యలను ప్రక్కన బెట్టి మంత్రులు ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ పాదయాత్ర 34వ రోజు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో కొనసాగింది. గంగారం నుంచి ప్రారంభమైన పాదయాత్ర కాల్వ శ్రీరాంపూర్ ఇప్పలపల్లి మల్యాల మీదుగా కొనసాగింది. బట్టి పాదయాత్ర కాల్వశ్రీరాంపూర్ కు చేరుకోవడంతో మహిళలు మంగళహారతో స్వాగతం పలికారు. మత్స్యశాఖ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బట్టివిక్రమార్క వలలు ప్రదర్శించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని అమ్ముకుంటున్నారు.
చివరకు మనం పీల్చే గాలి కూడా అమ్ముకుంటారు. అమరవీరుల బలిదానాలకు స్పందించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర సంపదను దోచుక తింటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తె కూలి బందు ఏర్పాటు చేసి 12,000 రూపాయలను అందిస్తామన్నారు. సీఎల్పీనేత బట్టి విక్రమార్క ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి అధికారమిస్తే ఇసుక, మట్టి, విద్యను అమ్ముకుంటున్నాడని ఆరోపించాడు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా చేస్తున్నాడు. మీ పాఠశాలలు ప్రజలలో పేద పిల్లలకు ఉచితంగా విద్య అందించు లేకపోతే మూసివెయ్యాలి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ ప్రాంత సహజ వరనులను అమ్ముకొని, అడ్డు వచ్చిన వారి పై అక్రమ కేసులు పెడుతూ పెద్దపల్లికి తలవొంపులు తీసుకువస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాసమస్యలను ప్రక్కన బెట్టి దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని అమ్ముకుంటున్నారు. చివరకు మనం పీల్చే గాలి కూడా అమ్ముకుంటారు.
అమరవీరుల బలిదానాలకు స్పందించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర సంపదను దోచుక తింటున్నారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించలేదు, హుస్సేన్ మియ వాగు పై చెక్ డ్యాం లు కట్టారు. అవి కొట్టుపోయాయి దీనివల్ల ప్రజాధనం వృద్ధా చేశారన్నారు. మహిళా సంఘాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఉన్న పథకాలను అమలు చేస్తామన్నారు. కూలీ బంద్ కింద నిరుపేదలందరికీ సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాణిక్యం సింగ్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, జడ్పీటీసీ గంట రాములు యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు మునీర్ కాంగ్రెస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.