బీఆర్ఎస్ నాయకుడిపై కేసు నమోదు..

by Disha Web Desk 23 |
బీఆర్ఎస్ నాయకుడిపై కేసు నమోదు..
X

దిశ,గంభీరావుపేట : భూమి అమ్ముతానని,అడ్వాన్స్ తీసుకొని,భూమి రిజిస్టర్ చేయకుండా, అడ్వాన్స్ డబ్బులు ఇవ్వమని అడిగితే బెదిరింపులకు గురిచేసిన బీ ఆర్ఎస్ నాయకుడు కమలాకర్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు.ఎస్సై రామ్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక మండల నాగారం గ్రామానికి చెందిన కాముని రాములు, గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి కుర్దు లింగంపల్లి శివారులో గల 103 బీ సర్వే నెంబరు గల 6.6 ఎకరాల భూమి కలదని, ఒక ఎకరం భూమి రూ.తొమ్మిది లక్షల 60 వేల రూపాయలకు అమ్ముతానని కాముని రాములు 2019 సంవత్సరంలో రూ.రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడని తెలిపారు. మిగతా డబ్బులు బాండ్ పేపర్ రాసుకున్నారని అన్నారు. ఆ భూమి కోర్టు ద్వారా కమలాకర్ రెడ్డి చిన్ననానా కూతురు కు సంబంధించినదని తెలువడంలో ,కమలాకర్ రెడ్డిని ఆ భూమి నీది కానిది ఎందుకు అమ్మవాని, అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కాముని రాములు అడిగాడు. దిక్కున్న చోట చెప్పుకో, డబ్బులు ఇవ్వను బూతులు తిట్టి,బెదిరించడంతో రాములు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.ఇంకెవరైనా లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి బాధితులు ఉంటే భయపడకుండా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలి అని అన్నారు.

నాపై చేసేవన్నీ అసత్య ప్రచారాలు.. : బీఆర్ఎస్ నాయకుడు కమలాకర్ రెడ్డి

కమలాకర్ రెడ్డి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. కింది కోర్టులో సురేఖ రెడ్డికి అనుకూలంగా వచ్చిందని ఆ భూమి కేసు విషయమై నేను హైకోర్టులో స్టే తెచ్చుకున్నాను.స్టే కాపీ 26, ఏప్రిల్ 24 సంవత్సరాల వరకు ఇంకా 8 రోజులు స్టే ఉన్నదని అయినా నాపై కేసు నమోదు చేశారని అన్నాడు.

Next Story

Most Viewed