MLA Chennamaneni Ramesh : చెన్నమనేనికి క్యాబినెట్ హోదా..

by Sumithra |   ( Updated:2023-08-26 12:52:59.0  )
MLA Chennamaneni Ramesh : చెన్నమనేనికి క్యాబినెట్ హోదా..
X

దిశ, వేములవాడ : వేములవాడ అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబును కాదని చల్మెడ లక్ష్మీనరసింహారావుకు టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. చెన్నమనేని పార్టీ మారుతారు అన్న ఊహాగానాలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ చేన్నమనేని బుజ్జగించి సయోధ్య కుదిర్చి ఆ సమస్యకు పుల్ స్టాప్ పెట్టారు. ఇక గడిచిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన మనోహర్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ ఐదు సంవత్సరాలు గడిచిన ఎలాంటి పదవి లేకపోవడం, ఎన్నికల నేపథ్యంలో చెన్నమనేనికి క్యాబినెట్ హోదా దక్కడం పై కార్యకర్తలు మౌనంగా గుసగుసలాడుతున్నారు. అయితే చెన్నమనేనికి పెద్ద పదవి కట్టబెట్టిన నేపథ్యంలో చల్మెడనా, చెన్నమనేనినా అని తేల్చుకోలేక కార్యకర్తల్లో ఒక జలక్ మొదలయ్యింది.

వ్యవసాయ రంగానికి ప్రభుత్వ సలహాదారుగా ఐదు సంవత్సరాల పాటు క్యాబినెట్ హోదాను కలిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు ఇవ్వగా చెన్నమనేనికి పెద్ద పదవే దక్కినట్లు అయింది. 2009లో మహాకూటమి నుండి పోటీ చేసిన రమేష్ తిరిగి 2010 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడు పర్యాయాలు గెలిచిన నేపథ్యంలో పౌరసత్వ వివాదంగా ఆయనను పక్కకు పెట్టినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వివరించిన విషయం తెలిసిందే. గత ఆరు మాసాలుగా వేములవాడ నియోజకవర్గంలో తనదైన శైలిలో లక్ష్మీనరసింహారావు అనేక సేవాకార్యక్రమాలతో ముందుకు వెళుతూ టికెట్ దక్కించుకోవడం పార్టీ వర్గాల్లో సంతోషాన్ని నింపిన చెన్నమనేని పదవితో కార్యకర్తల్లో ఆందోళన నెలకొని ఉంది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న చెన్నమనేని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఏ స్థాయిలో ఉన్న కార్యకర్తలను నాయకులను పక్కన పెట్టగా...!? అయితే మరో కేబినెట్ పదవి దక్కడం పట్ల ఎటువైపు ఉండాలో దిగువ శ్రేణి నాయకులు తేల్చుకోలేకపోతున్నట్టుగా తెలుస్తోంది.

నిన్నటి వరకు చల్మెడ వైపు ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు మళ్లీ చెన్నమనేనికి పదవి రావడంతో పూలే బొకేలతో ప్రత్యక్షమవుతున్నారు. ఇక మరోవైపు మనోహర్ రెడ్డి సైతం ఇటీవల తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించి తగిన ప్రాధాన్యత ఇచ్చాకే ముందుకు వెళ్దామని కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆయన నడుచుకుంటానని వెల్లడించారు. ఇక ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ సమీకరణలు ఎవరికి లబ్ధి జరుగుతాయని ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ నాయకులు ఆసక్తిగా గమనిస్తూ ఆచితూచి అడుగు వేస్తున్నారు. టికెట్టు ప్రకటించిన రోజు నుండి చల్మెడ అన్ని వర్గాల బీఆర్ఎస్ నేతలను ఇంటికి వెళ్లి కలుస్తూ తనకు సహకరించాలని కోరుతూ ప్రచారంలో కాగా వేములవాడ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలో నాయకుల మధ్య ఏర్పడ్డ గ్యాప్ ను పూడ్చేందుకు జిల్లా మంత్రి కేటీఆర్ఏ స్వయంగా రంగంలోకి దిగితే తప్ప నాయకుల్లో ఏకాభిప్రాయం వచ్చేట్లు కనపడటం లేదు.

Advertisement

Next Story

Most Viewed