- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హత్యాయత్నం కేసులో ఇద్దరి రిమాండ్
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు యత్నించిన కేసులో పోలీసులు ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. తంగాలపల్లి మండల పరిధిలోని ఇంద్రనగర్ గ్రామం భారత్ నగర్ కాలనీకి చెందిన చిట్యాల శైలజ (26), బాలకృష్ణ భార్యభర్తలు. వారికి ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది, వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
సాఫీగా సాగుతున్న వాళ్ల జీవితంలో వరుసకు మరది అయిన చిట్యాల శ్రీకాంత్ అనే వ్యక్తి తో శైలజకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా.. వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే శైలజ, శ్రీకాంత్ ఇద్దరూ తరచు ఫోన్ లో మాట్లాడుకునే వారు. ఇది గమనించిన భర్త బాలకృష్ణ ఇద్దరిని మందలించాడు. దీంతో వారిద్దరూ కలుసుకునేందుకు బాలకృష్ణ అడ్డుగా ఉన్నాడని భావించిన శైలజ, శ్రీకాంత్ బాలకృష్ణను హతమార్చేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. పొలం పనికి బాలకృష్ణ వెళ్తుండడం గమనించి అక్కడే కరెంట్ షాక్ తో అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. మార్చి3, 2023 రోజున శైలజ, శ్రీకాంత్ పొలం వద్దకు వెళ్లి బాలకృష్ణ రోజూ నడిచే దారిలో కరెంటు వైర్లను అమర్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అదృష్టవశాత్తూ ఆ ప్రమాదం నుంచి బాలకృష్ణ తృటిలో తప్పించుకున్నాడు. ప్లాన్ అట్టర్ ప్లాప్ కావడంతో భయంతో శైలజ, శ్రీకాంత్ ఇంటి నుంచి పారిపోయారు. ఈ మేరకు బాలకృష్ణ తంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఇద్దరిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు హత్యాయత్నం కింది కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులిద్దరూ వరంగల్ పట్టణంలో ఉన్నారనే సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.