శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్ VCని నియమించాలని ఏబీవీపీ ధర్నా

by Mahesh |
శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్ VCని నియమించాలని ఏబీవీపీ ధర్నా
X

దిశ, కరీంనగర్ టౌన్: శాతవాహన యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర సిబ్బంది నియమించాలని ఏబీవీపీ ధర్నాకు దిగింది. మంగళవారం విద్యార్థులతో కలిసి క్యాంపస్ మేయిన్ గేట్ వద్ద కూర్చోని.. ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, రెగ్యులర్ VCని నియమించాలని నూతన వృత్తి కోర్సులను ప్రవేశపెట్టి PhD అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ నాయకులు శాతవాహన యూనివర్సిటీని ముట్టడించారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న తరుణంలో కొత్తపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థి నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ అజయ్,రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ రంజిత్ ,జిల్లా కన్వీనర్లు పూసాల విష్ణు, మాడవేణి సునీల్, బండి రాజశేఖర్, సామలపల్లి ప్రశాంత్, నగర కార్యదర్శిలు భామండ్ల నందు, రాజు, సిద్ధార్థ, వరుణ్, హాస్టల్ కన్వీనర్ రాసూరి ప్రవీణ్, ఓమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధు, శ్రీపతి సాయి తేజ అజయ్, నాయకులు శ్రీ వర్ధన్, ప్రదీప్, విగ్నేష్, అనిల్, విష్ణు ,ప్రశాంత్ హరి ఓం, మారుతి, మెరుగు సిద్ధార్థ, మనీషా,అలేఖ్య, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story