కోల్ కతా ఘటన నేపథ్యంలో మంత్రి దామోదర ఎదుట జూడాల కీలక విజ్ఞప్తి

by Prasad Jukanti |   ( Updated:2024-08-19 12:37:25.0  )
కోల్ కతా ఘటన నేపథ్యంలో మంత్రి దామోదర ఎదుట జూడాల కీలక విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్ ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ఘటన నేపథ్యంలో తాజాగా సోమవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహాతో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రిని కలిసి ప్రభుత్వ ఆసుపత్రులలో, మెడికల్ కాలేజీలలో డాక్టర్లకు, నర్సింగ్ ఆఫీసర్లకు, ఆసుపత్రి సిబ్బందికి అవసరమైన భద్రత చర్యలు చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. కోల్ కతా ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని మహిళా డాక్టర్లకు, నర్సింగ్ సిబ్బందితో పాటు టీచింగ్ ఆసుపత్రులలో పని చేస్తున్న సిబ్బందికి రక్షణ ఏర్పాటు చేయాలని కోరారు. జీవో నెంబర్ 103 ప్రకారం అన్ని ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఎస్పీఎఫ్ ఫోర్స్ తో భద్రతా ఏర్పాట్లను చేయాలని కోరారు. ఆసుపత్రులలో సీసీ టీవీతో పాటు శిక్షణ కలిగిన సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని ఆసుపత్రులలో నియమించే కమిటీలలో జూనియర్ డాక్టర్లకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. జూడాలు ఇచ్చిన వనతిపత్రంలోని పలు అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed