నల్లబ్యాడ్జీలతో సచివాలయంలో జర్నలిస్టుల నిరసన

by Prasad Jukanti |
నల్లబ్యాడ్జీలతో సచివాలయంలో జర్నలిస్టుల నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వరుసగా జర్నలిస్టులపై జరుగుతున్న పోలీసుల దాడులపై మీడియా ప్రతినిధులు ఖండించారు. పోలీసుల వైఖరికి నిరసనగా బుధవారం రాష్ట్ర సచివాలయం వద్ద కలిగిన మీడియా పాయింట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం వారిని అరెస్ట్ చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ అభ్యర్థులు, నిరుదోగులు నిరసనలను కవర్ చేసేందుకు వెళ్లిన జీ న్యూస్ రిపోర్ట్, వీడియో జర్నలిస్ట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద 10టీవీకి చెందిన మహిళా జర్నలిస్ట్ తో పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Next Story