- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలో జనసేన పొత్తు చిచ్చు..? కార్యకర్తల్లో డైలమా..!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ- జనసేన పొత్తుపై కమలనాథుల్లో చిచ్చు మొదలైంది. ఈ పొత్తులో భాగంగా ఏ స్థానం ఇస్తారు.. ఎవరిపై సీటుకు ఎసరు వస్తుందో అన్న భయందోళనలలో పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.
ఈ నేపథ్యంలో తాజాగా వేరువేరుగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నేతలు సమావేశమయ్యారు. శేరిలింగంపల్లి టికెట్ జనసేనకు ఇవ్వడమనేది కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన శేరిలింగంపల్లి టికెట్ రవి యాదవ్‌కు వచ్చేలా పావులు కదుపుతూ బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం అయినట్లు తెలిసింది.
అసమ్మతి సెగ..
కూకట్ పల్లి టికెట్ జనసేనకు ఇస్తారని తెలియడంతో టికెట్ ఆశించిన మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి చాలా నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలోనే ఆయన అనుచరులు ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. పొత్తులో భాగంగా కూకట్‌పల్లి అసెంబ్లీ టికెట్‌ను జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. జనసేనకు ఆ స్థానాన్ని కేటాయించి తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దన్నారు.
కూకట్‌పల్లి స్థానాన్ని జనసేనకు కేటాయించడమంటే బీఆర్ఎస్‌ను గెలిపించడమేనని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నర్సాపూర్ బీజేపీ టికెట్ మురళి యాదవ్‌కు కేటాయించడాన్ని బీజేపీ నర్సాపూర్ బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో పలువురు నర్సాపూర్ బీజేపీ కార్యకర్తలు ఇవాళ స్టేట్ ఆఫీస్ ముందు బైఠాయించారు. భూ కబ్జాదారుడు, బీఆర్ఎస్ నేతలతో సంబంధం పెట్టుకున్న వారికి టికెట్ ఎలా ఇస్తారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
- Tags
- janasena party