- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jana Reddy: నన్ను తిడితే పడతా.. కానీ వాళ్లెందుకు సైలెంట్‌గా ఉన్నారో తెలియడం లేదు

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత జానారెడ్డి(Jana Reddy) స్పందించారు. తనపై మల్లన్న చేసిన ఆరోపణలను ఖండించారు. కులగణన సర్వేతో తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ప్రస్తుతం తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. కేవలం నేతలకు సలహాలు, సూచనలు మాత్రమే చేస్తున్నానని తెలిపారు. నోటికి ఎంత వస్తే అంత.. గాలి మాటలు మాట్లాడితే కుదరదు అని వార్నింగ్ ఇచ్చారు. నన్ను ఎవరు తిట్టినా పట్టించుకోను.. తప్పు చేసిన వాడిని క్షమించే గుణం తనదని అన్నారు.
నన్ను విమర్శిస్తే తమ పార్టీ నేతలు కూడా స్పందించడం లేదు, ఖండించడం లేదు అని ఆవేదన చెందారు. సొంత నేతలే తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తుంటే అధిష్టానం కూడా ఎందుకు మౌనంగా ఉందో వారికే తెలియాలి అని అన్నారు. కాగా, అంతకుముందు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే(Caste Census Survey) తప్పుల తడక అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో కాంగ్రెస్ ముఖ్య నేత జానారెడ్డి హస్తం ఉందని.. కుట్రపూరితంగానే సర్వే చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినా పర్లేదని.. కానీ బీసీ ఉద్యమం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదని కీలక ప్రకటన చేశారు. కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలి.. రాహుల్ గాంధీ(Rahul Gandhi) తలెత్తుకుని తిరగాలని తాను ఆశించానని తీన్మార్ మల్లన్న అన్నారు. నూటికి నూరు శాతం పారదర్శకంగా సర్వే చేస్తేనే ఆదర్శంగా ఉంటుందని చెప్పారు. అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించి.. బీసీ వర్గాలను(BC Community) అణచిపెట్టే ప్రయత్నం చేశారని మరోసారి ఆరోపించారు.