బిచ్చగాళ్ళం అంటూ.. BRS MLA సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-05-20 15:22:20.0  )
బిచ్చగాళ్ళం అంటూ.. BRS MLA సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: ఒక్కో ఓటును ఎలా తెచ్చుకోవాలో అని చూస్తాము కానీ.. పోగొట్టుకోలేము కదా, రాజకీయాల్లో ఉన్న ఓట్ల బిచ్చగాళ్ళం అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాలేజీ గ్రౌండ్‌లో ట్రాక్ ఏర్పాటు చేయాలనే ఆలోచన తనకు మొదటి నుండే ఉండేదని తెలిపారు. మొదట్లో రోడ్డు వరకు ఉన్న గ్రౌండ్ ప్రస్తుతం కుచించుకుపోయింది అంటూనే నా నోటి నుండి ఏదైనా తప్పుగా వస్తే ఓట్లు పోతాయంటూ చమత్కరించారు. అయితే మంచి మాట్లాడితే ఓట్లు పోవన్నారు. సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలు మరోసారి జగిత్యాలలో హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed