- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Minister Seethakka : జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి : మంత్రి సీతక్క డిమాండ్

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad kumar)పై చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) ఫైర్ అయ్యారు. తక్షణమే జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉందని, స్పీకర్ చైర్ ను ఒక వ్యక్తి లాగా కాకుండా వ్యవస్థ లాగా చూడాలని విపక్షాలకు సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము చాలా అవమానాలు ఎదుర్కొన్నామని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అట్టడుగు వర్గాలను అవమానించే విధంగా మాట్లాడారని వెల్లడించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏక వచనంలో స్పీకర్ ను అవమానించారన్నారు.
సభలోని అన్ని రికార్డులు పరిశిలించామని, గవర్నర్ ను కాంగ్రెస్ కార్యకర్తగా పిలిచి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు అప్పుడు మహిళా గవర్నర్, నిన్న ట్రైబల్ గవర్నర్, ఇప్పుడు స్పీకర్ ను అవమానించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక నిబంధనలు కొత్తగా తీసుకొచ్చారని, అప్పుడు విపక్షాలను పోడియం వద్దకు కూడా రానివ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. దళిత వర్గాలకు చెందిన స్పీకర్ ను టార్గెట్ చేయడం మంచిది కాదని, ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించి, జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశించి "స్పీకర్ శాసనసభ సభ్యుల అందరి తరపున పెద్ద మనిషి అంతేగాని సభ మీ ఒక్కరిదే కాదు" అని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. స్పీకర్ దళితుడు కాబట్టే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. స్పీకర్ ను అగౌరవపరిచేలా మాట్లాడలేదని బీఆర్ఎస్ సభ్యులు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. స్పీకర్ కు జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. కొద్దిసేపు ఈ విషయమై సభలో ఇరు పార్టీల సభ్యులు పొటాపోటీగా నినాదాలు ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.