- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో రోజు BRS MLC వెంకట్రామిరెడ్డి కంపెనీల్లో ఐటీ సోదాలు
దిశ, వెబ్‌డెస్క్: అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన MLC వెంకట్రామిరెడ్డి కంపెనీల్లో ఐటీ అధికారులు రెండో రోజూ సోదాలు జరుపుతున్నారు. ఎమ్మెల్సీ ఫ్యామిలీకి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ కంపెనీల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రాజపుష్ప ప్రాపర్టీస్ కంపెనీతో పాటు వెర్టెక్స్, ముప్ప రియల్ ఎస్టేట్ సంస్థలు, వసుధ ఫార్మా కంపెనీ ప్రధాన కార్యాలయం, డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, మంగళవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని రాజపుష్ప లైఫ్ స్టైల్ విల్లాస్‌లో ఉంటున్న కంపెనీ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, జయచంద్రారెడ్డి, చరణ్ రాజ్, ఎండీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ సుజిత్ రెడ్డితో పాటు అకౌంటెంట్స్, సిబ్బంది ఇండ్లల్లో తనిఖీలు నిర్వహించారు. అంతేగాక, ఇదే విల్లాస్‌లో ఉంటున్న వెంకట్రామిరెడ్డి ఇంట్లోనూ సోదాలు చేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రాజపుష్ప కంపెనీ పెట్టుబడులు, ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు.