- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణ ప్రతిష్టకు రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం దురదృష్టకరం : మల్లు రవి ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం దురదృష్టకరమని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. ఇవాళ ఆయన సెక్రటేరియట్‌లో మీడియాతో మాట్లాడతూ.. దేశానికి ప్రథమ పౌరురాలు గిరిజన మహిళ అయినందునే ఆహ్వనించలేదా అని ఆరోపించారు. స్వాతంత్రం రాక ముందు అంటరానితనంపై, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలను దేవాలయాలకు రానివ్వకపోవడంతో పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల తరువాత కూడా గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి రామ మందిర ప్రారంభోత్సవానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు రాష్ట్రపతికి ఆహ్వానం లేకపోవడం అవమానమేనని అన్నారు. రామ మందిర కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. రాముడు అందరివాడని, ఆయన రాజ్యంలో అందరూ సమానులేనని పేర్కొన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం ఉన్నా.. ట్రస్ట్‌తో సంబంధం లేకుండా బీజేపీ తన పార్టీ కార్యక్రమంగా నిర్వహించిందని ఆరోపించారు. దేశంలో రాముడు, హనుమాన్ దేవాలయం లేని గ్రామం ఉండదని తెలిపారు. రాముడి చరిత్ర పిల్లాడిని అడిగినా చెప్తాడని. మోదీ కొత్తగా చెప్పాల్సిన పనిలేదన్నారు. అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశ ప్రజలందరికీ సమానంగా న్యాయం చేయాలని కోరుతున్నానని మల్లు రవి తెలిపారు.