- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly: సబితమ్మ నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ఆశీర్వదించిన మాట వాస్తవం.. కానీ: సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య నువ్వా నేనా అన్నట్లు మాటల యుద్ధం నడుస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ మీ వెనకాల కూర్చున్న అక్కలు నమ్మించి మోసం చేస్తారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతరం పలువురు మంత్రులు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. మాట మాటకు నన్నే టార్గెట్ ఎందుకు చేస్తున్నారని.. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని పార్టీలో చూపించుకుని ఆశీర్వదించింది నేను కాదా.. సీఎం రేవంత్ రెడ్డి గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నన్ను ఆశీర్వదించిన మాట వాస్తవం. ఆ సమయంలో సబితమ్మను అక్కగా భావించే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. కానీ తీరా పార్లమెంట్ ఎన్నికల సమయంలో తనను మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కేసీఆర్ మాయమాటలు నమ్మి నన్ను మోసం చేశారని.. తనను మోసం చేశారు కాబట్టి.. సబితమ్మను నమ్మొద్దని కేటీఆర్‌కు చెబుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పుకొచ్చారు. ఈ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.