- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS ఎమ్మెల్యే నందిత ఆకస్మిక మరణం అత్యంత విషాదకరం: CM రేవంత్ దిగ్భ్రాంతి
దిశ, వెబ్‌డెస్క్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే లాస్య నందిత మృతి చెండడం బాధ కలిగించిందన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం.. ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
కాగా, ఇవాళ తెల్లవారుజూమున పటాన్ చెరు సమీపంలో ఓఆర్ఆర్‌పై లాస్య ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. అతి వేగంగా దూసుకెళ్లిన ఆమె కారు అదుపుతప్పి డీవైడర్‌ను కొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్కకడే మృతి చెందారు. ఆమె డైవ్రర్, పీఏలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రి తరలించారు. చిన్న వయస్సుల్లోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో ఆమె కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర విషాదం నెలకొంది.