CM Revanth Reddy : కాళేశ్వరం కాదది.. కూలేశ్వరం : సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
CM Revanth Reddy : కాళేశ్వరం కాదది.. కూలేశ్వరం : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్(Station Ghanpur) నియోజకవర్గంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఓరుగల్లును రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మ వంటి యోధులు పాలించిన గడ్డ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ వరంగల్ జిల్లా అని కొనియాడారు. ఈ ప్రాంతం అంటే తనకు ప్రత్యేక అభిమానం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మామునూరు ఎయిర్పోర్టు(Mamunuru Airport) ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం రూ.800 కోట్లతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ.8 లక్షల అప్పుల రాష్ట్రంగా బీఆర్ఎస్(BRS) మార్చిందని మండిపడ్డారు.

ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్(KCR) దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత కరెంటు ఇస్తున్నామని, డిస్కంలకు బకాయిలు పెట్టారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణామాఫీలు చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్య కారణం అయిన నియామకాలు చేపట్టి పూర్తి చేస్తున్నామని, ఒక్క ఏడాదిలోనే 55 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం సరిపోవడం లేదని.. అయినా ప్రజలకు సంక్షేమ పథకాలకు ఒక్క రూపాయి కూడా ఆపడం లేదని అన్నారు. కడియం శ్రీహరి(Kadiyam Srihari) నిజమైన నాయకుడు అని, తనకోసం ఎలాంటి పైరవీలు చేయరని.. ప్రజలకోసం పథకాలు ఇవ్వమని, వాటికి నిధులు ఇవ్వండి అని మాత్రమే అడుగుతారని అన్నారు.

కడియం కావ్య(Kadiyam Kavya)ను ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపితే.. కేంద్రంతో కొట్లాడి వరంగల్ కు ఎయిర్పోర్టును, ఖాజీపేట రైల్వే డివిజన్ ను తీసుకు వచ్చిందన్నారు. లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం(Kaleshwaram) కట్టారని.. కనీసం మూడేళ్లు కూడా ఆ ప్రాజెక్టు ఆగలేదని మండిపడ్డారు. అది కాళేశ్వరం కాదని.. కూలేశ్వరం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎన్నో.. బీఆర్ఎస్ కట్టినవి ఎన్నో తేల్చుకుందామని.. దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Next Story

Most Viewed